Tuesday, August 10, 2010

నా బ్లాగు పేరుకి అద్దాలు


అటుగా వెళ్తున్న నన్ను పలకరించి, కాగితం పూలమని మాపై శీతకన్ను వేసావా అని అడిగాయి



జవాబు చెప్పకుండా తదేకంగా చూస్తున్న నన్ను చూసి సిగ్గుతో కిసుక్కున నవ్వాయి



ఇంతలో....రంగు లేని వాటికే అంత మెరుపుంటే మాకెంతుండాలి అంటూ తలెగరేసాయి



హ్మ్ మీరెంత విరగబూసినా నా ఎత్తు ఎదగలేరు అంటూ ఆకాసాన్ని తాకింది ఈ పొడవాటి పైన్ చెట్టు