Tuesday, July 10, 2012

ప్రకృతి-ఆకృతి


ఈ పచ్చని చెట్లలో ఏ ఆకృతి దాగెనో!
ఈ చక్కటి వైఖరి ఏ కన్నులు చూసెనో! (నా కన్నులే) :)


చుంచుబుడ్లు, మందార కుంపీలు

దీనంగా పాతళానికి జారిపోతున్న స్త్రీ

అనకొండ


Monday, January 23, 2012

కాగితం పూలు

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు...పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ!
నాకేంటో కవిత్వం రాదు! వచ్చుంటేనా, కాగితం పూలై ఉండి ఇంత అందాన్ని నింపుకున్న ఈ విరిబాలలపై ఓ పది కవితలన్నా రాసేసుండేదాన్ని. నవ్వే గులాబీల ముందు, మురిపించే మల్లెల ముందు ఈ కాగితం పూలు కంటికి ఆనవేమోగానీ వీటి అందం సామాన్యమైనదికాదు. వనమంతా విస్తరించి, గుత్తులుగా పూసి కనువిందు చెయ్యడంలో వీటికి ఇవే సాటి. మది దోచుకునే చెలువములు ఈ కాగితం పూలు!