Monday, January 23, 2012

కాగితం పూలు

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు...పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ!
నాకేంటో కవిత్వం రాదు! వచ్చుంటేనా, కాగితం పూలై ఉండి ఇంత అందాన్ని నింపుకున్న ఈ విరిబాలలపై ఓ పది కవితలన్నా రాసేసుండేదాన్ని. నవ్వే గులాబీల ముందు, మురిపించే మల్లెల ముందు ఈ కాగితం పూలు కంటికి ఆనవేమోగానీ వీటి అందం సామాన్యమైనదికాదు. వనమంతా విస్తరించి, గుత్తులుగా పూసి కనువిందు చెయ్యడంలో వీటికి ఇవే సాటి. మది దోచుకునే చెలువములు ఈ కాగితం పూలు!










28 comments:

మధురవాణి said...

WOW! నాకు చాలా ఇష్టం కాగితం పువ్వులంటే.. :)

రాజ్ కుమార్ said...

వీటిని కాగితం పూలంటారా? నాకూ ఇష్టమే గానీ పేరు తెలీదు. నేను ఇప్పటి దాకా గులాబీరంగులో ఉన్నవే చూశాను. కలర్ఫుల్ గా బాగున్యాయ్.. ;)

అయినా ఆకుల్ని పువ్వులూ అని ఎందుకన్నారు చెప్మా..!

మనసు పలికే said...

వీటిల్లో ఇంకా చాలా రంగులుంటాయి కదూ.. ఈ రంగు చాలా చాలా బాగుంది, అఫ్‌కోర్స్ ఏ రంగుకారంగే అనుకోండి:). పిక్స్ చాలా బాగున్నాయి:)

శ్రీలలిత said...

అవునుకదా! వీటికి కాగితంపూలు అని పేరెందుకు వచ్చిందో?
ఎన్నెన్ని రంగులతో, గుత్తులు గుత్తులుగా ఎంత బాగుంటాయో..

జ్యోతిర్మయి said...

బ్లూ బాక్ గ్రౌండ్ మీద పూల రంగు చాలా బావుంది. గుడ్ పిక్స్

మాలా కుమార్ said...

బాగున్నాయి .

Anonymous said...

A good taste

వేణూశ్రీకాంత్ said...

బాగున్నాయ్ :-)

ఫోటాన్ said...

కాగితం పూలు పింక్ కలర్ లో కదా వుండేది..? వైట్ కలర్ కాగితం పూలు చూసా...
బట్ రెడ్ కలర్ కాగితం పూలు చూడటం ఇదే మొదటి సారి... చాలా బాగున్నాయి... చాలా మంచి ఫోటోగ్రఫి..

ఆ.సౌమ్య said...

@ మధురా
నీకూ ఇష్టమా...సేం పించ్!

@ రాజ్
నువ్వు నీ డౌట్లూను...అవి అంత చక్కాగా పువ్వులా ఉంటే ఆకుల్లా ఎక్కడ కనిపించాయిట?

ఆ.సౌమ్య said...

@ అప్పు
అవును, చాలా రంగుల్లో ఉంటాయి అప్పు...నేను ఎక్కువగా గులాబీ, తెల్ల రంగు పువ్వులే చూసాను. ఈ ముదురు ఆరెంజ్ రంగులో చూడడం ఇదే మొదటిసారి...ఎంత అందంగా ఉన్నాయనుకున్నావ్...రెండు కళ్ళు చాల్లేదనుకో!

@ శ్రీ లలితగారూ
ఆ పేరు వెనకున్న రహస్యం ఏమిటో మరి :)
అవునండీ చెట్టు నిండా విరగబూస్తాయి...భలే బావుంటాయి! thanks!

ఆ.సౌమ్య said...

@ జ్యోతిర్మయి గారు
Thank a lot!

@ మాల గారు
Thank you!

ఆ.సౌమ్య said...

@ కష్టేఫలే
ధన్యవాదములండీ!

@ వేణూ
Thanks! :)

ఆ.సౌమ్య said...

@ ఫోటాన్
యెస్ ఈ రంగు చూడడం నాకూ మొదటిసారి...గులాబీ, తెలుపు కంటే ఇవి ఇంకా చాలా అందంగా ఉన్నాయి!
Thanks! :)

నిషిగంధ said...

వావ్! ఫోటోలు చాలా బావున్నాయ్, సౌమ్యా!! నీ కెమెరా కన్ను ఇంతందంగా ఉంటుందని ఇప్పుడే తెల్సింది :-)
అసలు గుత్తులుగుత్తులుగా విరగబూసి ఎంతందంగా ఉంటాయో! వీటిని తల్లో పెట్టుకోడానికి కుదరదే అని విచారించని క్షణం లేదనుకో :))

ఆ.సౌమ్య said...

Thnaks నిషీ...ఏదో మీ అభిమానం :)
కదా, ఇవి తలలో పెట్టుకోగలిగితే నేను పెద్ద మాల కట్టి పెట్టుకుందును!

kiran said...

chaalaaaaa chaaaaaaalaaaaaa bagunnaaay...!! :)

ఆ.సౌమ్య said...

Thank youuuuuuuuuuu Kiran! :)

ఛాయ said...

1 ఫోటోలు అదుర్స్.
2 నీలి ఆకాశం లో పూసిన ఆశలు...
3 "ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు,
పూలిమ్మని రేమ్మరేమ్మకు " ఈ పాటా చూడండి...
మిగిలిన పూల లాగ వీటి స్పర్శ మృదువుగా వుండదు. బహుశ అందుకే ఆ పేరు వచిందేమో.

ఆ.సౌమ్య said...

@ఛాయ గారు
భలే పాట గుర్తు చేసారండీ. అవును వీటికి ఆ పాట సరిగ్గా సరిపోతుంది...."ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ"
ఈ పాట తో పోస్ట్ అప్డేట్ చేస్తాను.

నీలి ఆకాశం లో పూసిన ఆశలు...కూడా సూపర్!. ఈ సారి నాకు కేప్షన్ తట్టకపోతే మొట్టమొదట మిమ్మల్నే అడుగుతా. నాకు ఇలాగే సాయం చెయ్యాలి మరే ఏం! :)

మీరు చెప్పిన మృదుత్వం వివరణ సమంజసంగానే ఉందండోయ్...ఆ మృదుత్వం లేకపోవడం వల్లేనేమో వీటికి ఆ పేరొచ్చింది.

Rajesh said...

Nice shots Sowmya gaaru.

ఆ.సౌమ్య said...

@ Rajesh
Thanks a lot! :)

thanooj said...

nakenduko andaru abaddapu comments pedutunnaranipisthundhi(thamashaki)-(kademo )

ఆ.సౌమ్య said...

@thanooj

ఇతరుల గురించి ఎందుకండీ గెస్సింగులు?? మీ కామెంటేంటో straight గా పెట్టండి.

వెంకట రాజారావు . లక్కాకుల said...

ఒళ్ళంతా చెలువముతో
త్రుళ్ళింతలువోవు యెరుపుతో అబ్బా !! మా
కళ్ళింతలాయె సౌమ్యా !
ముళ్ళ గులాబీల కంటె ముచ్చట గొలిపెన్ .
----- సుజన-సృజన

ఆ.సౌమ్య said...

@రాజారావు గారూ
WOW...భలే చెప్పారండీ!
thanks! అవును ముళ్ళ గులాబీల కంటె ముచ్చట గొలిపెన్. :)

సంతు (santu) said...

కాగితం పూవులను నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను కానీ వాటిని ఇంత అందంగా కెమెరా లో చాలా బాగా బందించారు,
మా పెరటికే అందాన్ని తెచ్చిన మా ఈ కాగితం పూవులను అందంగా చిత్రించి చూపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ... సెలవు

ఆ.సౌమ్య said...

Thanks Mr. Santu :)